The govt of tamilnadu to appoint teachers of linguistic minorities
పత్రికా ప్రకటన
భాషా విధానంపై రాజకీయ గందరగోళంతో తెలుగు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
– తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
చెన్నై, 30-05-2026:
భాషా విధానంపై తమిళనాడులో రాజకీయ నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతోంది.
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి గాఉన్న శ్రీ ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు భాషల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది హిందీని హిందీ కాని రాష్ట్రాలపై పరోక్షంగా రుద్దే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో తమిళం, ఆంగ్లం మాత్రమే కొనసాగుతాయని, మూడు భాషల విధానాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కె. అన్నామలై నేటి ప్రకటన లో ఆరో తరగతి నుంచి మూడు భాషల విధానాన్ని స్వాగతించినప్పటికీ, ఈ ఏడాది నుంచే తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం ముందుగా 2029-30 నుంచి అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అకస్మాత్తుగా మార్పు చేయడం విద్యార్థులపై అదనపు భారం మోపుతుందని అన్నారు. ఈ ఇద్దరు నాయకుల విభిన్న ప్రకటనలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.